భార‌త్‌లో టిక్‌టాక్ బ్యాన్‌.. ఇలా స్పందించిన ఆ సంస్థ‌

భార‌త్‌లో టిక్‌టాక్ బ్యాన్‌.. ఇలా స్పందించిన ఆ సంస్థ‌

భార‌త్‌-చైనా జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌, ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ప్ర‌భుత్వం.. టిక్‌టాక్‌తో స‌హా 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది.. దీంతో.. పెద్ద‌ల నుంచి సామాన్యుల దాకా ల‌క్ష‌లాదిమంది భార‌తీయుల‌ను ఆక‌ట్టుకున్న టిక్‌టాక్ కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాయ‌మైపోయింది.. ఇక‌, టిక్‌టాక్ ఎంతోమంది క‌ళాకారుల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింద‌నే చెప్పాలి.. టిక్‌టాక్‌లో వీడియోలు, డ్యాన్స్‌లు, డైలాగ్‌లు.. ఇలా ఎంతో మంది ఫేమ‌స్ అయిపోయారు.. ఇంటి ద‌గ్గ‌ర టైంపాస్ కానివాళ్లు కూడా టిక్‌టాక్‌లో అడుగుపెట్టి.. త‌మ టాలెంట్‌ను చూపించ‌సాగారు.. దీంతో.. స్మార్ట్‌ఫోన్ ఉంటే.. టిక్‌టాక్ ఉండాల్సిందేన‌నే రేంజ్‌కి వెళ్లింది.. త‌క్కువ కాలంలోనే కోట్లాదిమందికి చేరువైంది.. అయితే, టిక్‌టాక్‌పై భార‌త ప్ర‌భుత్వం బ్యాన్ విధించ‌డంపై టిక్‌టాక్ స్పందించింది.. డేటా ప్రైవ‌సీ, సెక్యూరిటీ విష‌యంలో భార‌తీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్న‌ట్లు టిక్‌టాక్ ఇండియా పేర్కొంది. 

మ‌రోవైపు,  భార‌తీయ యూజ‌ర్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని విదేశీ ప్ర‌భుత్వాల‌తో షేర్ చేసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది టిక్‌టాక్‌.. చైనా ప్ర‌భుత్వానికి కూడా త‌మ స‌మాచారాన్ని ఇవ్వ‌లేద‌ని పేర్కొన్న టిక్‌టాక్‌.. ఒక‌వేళ ఎవ‌రైనా భ‌విష్య‌త్తులో స‌మాచారం కోరినా.. దాన్ని మేం వ్య‌తిరేకిస్తామ‌ని క్లారిటీ ఇచ్చింది. యూజ‌ర్ ప్రైవ‌సీ, స‌మాచారానికి అత్యున్న‌త ప్రాముఖ్య‌త‌ను ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించిన ఆ సంస్థ‌.. టిక్‌టాక్‌ను బ్లాక్ చేసిన నేప‌థ్యంలో ఆ అంశంపై భార‌త ప్ర‌భుత్వానికి క్లారిటీ ఇచ్చేందుకు ఆహ్వానం వ‌చ్చిన‌ట్లు కూడా పేర్కొంది.  కాగా, భార‌త్‌లో 59 యాప్స్ నిషేధంపై చైనాలో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది.