గ్రౌండ్ లో పిడుగు పాటు.. ముగ్గురు విద్యార్థులు బలి.. 

గ్రౌండ్ లో పిడుగు పాటు.. ముగ్గురు విద్యార్థులు బలి.. 

గుంటూరు జిల్లా గురజాల మండలంలోని సమాధానంపేట క్రికెట్ గ్రౌండ్ లో ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని పిడుగులు వణికిస్తున్నాయి. అకాల వర్షాలు.. ప్రకృతి వైపరీత్యం మూలంగా ఈరోజు ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 

వేసవి సెలవులు కావడంతో గ్రౌండ్ లో పవన్ నాయక్, హరిబాబు, మనోహర్ నాయక్ లు క్రికెట్ ఆడుకుంటున్నారు. అదే సమయంలో వర్షం కురవడంతో పాటు పిడుగులు పడ్డాయి. అక్కడి నుంచి ముగ్గురు బాలురు సురక్షిత ప్రదేశానికి వెళ్దామనుకునేలోపే పిడుగు పడటంతో అక్కడికక్కడే ఆ ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబసభ్యులు వారి పిల్లలను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.