లాక్ డౌన్ ప్రచారం..5రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం గిరాకీ..!

లాక్ డౌన్ ప్రచారం..5రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం గిరాకీ..!

హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే వార్త జోరుగా ప్రచారమౌతోంది. దాంతో పట్నంలో ఉన్న వలస కార్మికులు, ఇతర ప్రాంతాలనుండి వచ్చినవారు తిరిగి ఇంటిబాట పడుతున్నారు. మరోవైపు లాక్ డౌన్ అమలు చేస్తే మద్యం దుకాణాలు సైతం మూతపడతాయని మందుబాబులు భావించారు. దాంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఒకవేళ జులై 1నుండి లాక్ డౌన్ అమలు చేస్తే ఇక మద్యం దొరకదని భావించి ముందే కొనుక్కుని నిల్వ చేసుకున్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి మందు బాబులు తెచ్చే ఆదాయమే బాసటగా నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది.