బెంగళూరులో పెద్ద శబ్దానికి కారణం అదే...

బెంగళూరులో పెద్ద శబ్దానికి కారణం అదే...

 2020 వ సంవత్సరంలో నిత్యం ఏదొక ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి.  ఒకవైపు కరోనా భయపెడుతుంటే, మరోవైపు ఆర్ధిక మాంద్యం ఇబ్బందులు పెడుతున్నారు.  మరోవైపు ప్రకృతి విలయతాండవం చేస్తున్నది.  ఒకేసంవత్సరంలో ఒకే సమయంలో ఇన్ని విపత్తులు కలగడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. అయితే బెంగళూరు నగరం కరోనా నుంచి కోలుకొని బయటపడింది.  కరోనా నుంచి కోలుకున్న బెంగళూరు వాసులు తిరిగి తమ పనులను యధావిధిగా కొనసాగిస్తున్నారు.  ఈ సమయంలో సడెన్ గా నగరంలో తెలియని అలజడులు ఏర్పడ్డాయి.  

మధ్యాహ్నం సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు షాక్ అయ్యారు.  భూకంపం వచ్చిందేమో అని పరుగులు తీశారు. కానీ, అది భూకంపం కాదు.  పెద్ద పెట్టున విస్ఫోటక శబ్దం స్థానికులను కంగారు పెట్టింది. భూకంపం సంభవించిందని కొందరు అంటే మరి కొందరేమో గ్రాహాంతర వాసులు వచ్చారని లొల్లి పెట్టారు. ఇలా రకరకాల కారణాలు చెబుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ట్రైనింగ్‌లో భాగంగా యుద్ధవిమానం శబ్దవేగంతో ప్రయాణించినప్పుడు బూమ్ అన్న శబ్దం వెలువడిందని తెలిపింది. 35 వేల నుంచి 45 మధ్య శబ్దవేగంతో ఎగురుతున్న విమానం మెల్లగా తన వేగాన్ని తగ్గించుకోవడంతో ఈ సానిక్ బూమ్ వెలువడిందని తెలిపింది.