భారత్-చైనాల మధ్య మూడవ విడత చర్చలు ప్రారంభం...

భారత్-చైనాల మధ్య మూడవ విడత చర్చలు ప్రారంభం...

భారత్-చైనాల మధ్య మూడవ విడత చర్చలు ప్రారంభమయ్యాయి. లడఖ్ లోని ఛుషుల్ లో రెండు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు. ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని “వాస్తవాధీన రేఖ” పొడువునా కొనసాగుతున్న చైనా రక్షణ బలగాల మొహరింపు వివాద పరిష్కారం కోసం ఈ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఇంతక ముందు వాస్తవాధీన రేఖ” కు చైనా వైపు న ఉన్న “మోల్డో” లో గత రెండు విడతల సంప్రదింపులు జరిగాయి. జూన్ 22 న జరిగిన సమావేశం లో రెండు దేశాలకు చెందిన కోర్ కమాండర్ల స్థాయి సమావేశం లో పరస్పర అంగీకారానికి వచ్చిన ఇరు దేశాలు ఇక ఈశాన్య లడఖ్ ప్రాంతంలో ఏలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని రెండు దేశాల సైన్యాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో పూర్వ పరిస్థితి ని లడఖ్ , గాల్వన్ హిమ నదీ ప్రాంతంలో పునరుధ్దరించేందుకు సమాలోచనలు కొనసాగుతున్నాయి.