ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా... ప్రమాదంలో పడినట్టే...!!

ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా... ప్రమాదంలో పడినట్టే...!!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ఈ విషయం అందరికి తెలిసిందే.  పండ్లు చాలా రకాలు ఉంటాయి.  అయితే, కొన్ని పండ్లను పరగడుపున అస్సలు తినకూడదు.  పరగడుపుతో వాటిని తీసుకుంటే చాలా అనర్ధాలు వస్తాయి. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

చాలా మంది ఉదయాన్నే వర్కౌట్ చేస్తూ అరటిపండ్లు తింటారు.  అరటిపండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి.  అయితే, అరటిపండ్లలో మెగ్నీషియం ఉంటుంది.  ఇది గుండెకు చేటు చేస్తుంది.  అందుకే అరటి పండ్లను ఉదయాన్నే తీసుకోకూడదు.  

పుల్లటి పండ్లలో గ్యాస్ అధికంగా ఉంటుంది.  వీటిని పరగడుపున తీసుకుంటే, గ్యాస్, అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది.  కాబట్టి వీటిని ఉదయాన్నే తీసుకోకూడదు.  ఫైబర్ అధికంగా ఉండే పియర్ ఫ్రూట్ ను పరగడుపున తీసుకుంటే మూత్రనాళం దెబ్బతింటుంది.  లిచీ పండ్లను పరగడుపున తీసుకుంటే షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.  ఇక దోసకాయలో అమినోయాసిడ్స్ అధికంగా ఉంటాయి.  పరగడుపున తీసుకుంటే కడుపు నొప్పి, గుండె మంట రావొచ్చు.