ఉత్తర కొరియాలో ఇవి అసలు కనిపించవు... అక్రమంగా తెస్తే... ఇక అంతే... 

ఉత్తర కొరియాలో ఇవి అసలు కనిపించవు... అక్రమంగా తెస్తే... ఇక అంతే... 

ఉత్తర కొరియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఉత్తర కొరియాలో నివసించే వ్యక్తులు అక్కడి ప్రభుత్వం చెప్పినట్టుగానే నడవాలి.  ప్రభుత్వం అనుమతించిన వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి.  అలా కాదని విదేశాల నుంచి అక్రమంగా వేటినైనా దిగుమతి చేసుకుంటే దాని వలన కలిగే అనర్ధాలు అన్ని ఇన్నికాదు. మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది.  

అక్కడ నివసించే ప్రజలకు విదేశాలు ఎలా ఉంటాయో, వివిధ దేశాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది.  ఆ దేశంలో చాలా వస్తువులపై నిషేధం ఉన్నది.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  విదేశీ రేడియో, విదేశీ దుస్తులు, కోకోకోలా, జుట్టు పెంచుకోవడం, విదేశీ హెయిర్ స్టైల్, కండోమ్స్, మ్యాగజైన్స్, స్టార్ బగ్స్ , మెక్ డోనాల్డ్, విదేశీ ఐపాడ్, మొబైల్స్, విదేశీ ఇంటర్నెట్, విదేశీ సంగీతం చివరకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా సాధారణ పౌరులకు ఉండదు.  దేశంలో  ఉండే వ్యక్తులు దేశంలోని ప్రాంతాల్లో మాత్రమే తిరగాలి.