వడ్డీ రేట్లపై నేడు నిర్ణయం

వడ్డీ రేట్లపై నేడు నిర్ణయం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ)  వడ్డీ రేట్ల పెంపుపై ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. మార్కెట్‌ అంచనాల ప్రకారం ఆర్‌బీఐ ఈసారి వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు. ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు రూపాయి విలువ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచుతారనే భయం మార్కెట్‌ను వెంటాడుతోంది.  ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేసి... వచ్చే సమీక్షలో అంటే ఆగస్టు లో  కీలక రేట్లను పెంచే అవకాశముందని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి. ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడంతో.. ఇవాళ వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచవ్చని కొందరు అంచనా వేస్తున్నారు. చిన్న, మధ్య తరహా షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి చూస్తుంటే మార్కెట్‌ వడ్డీ రేట్ల పెంపును డిస్కౌంట్‌ చేసే దిశగా పయనిస్తోందని కొందరు ఆపరేటర్లు అంటున్నారు.  ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ఎమ్‌పీసీ  ఇవాళ మద్యాహ్నం మీడియాతో మాట్లాడుతుంది.  ఇంతకుమునుపు  జనవరి 2014లో రెపో రేటును 8 శాతానికి  ఆర్‌బీఐ పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచుతూ వస్తోంది. ప్రస్తుతం రెపో రేటు 6 శాతం వద్ద ఉంది. ఒకవేళ పెంచితే నాలుగేళ్ళ తరవాత  ఇదే మొదటిసారి అవుతుంది.
ఆగస్టు-అక్టోబరు మధ్య అర శాతం పెంపు 
ఆగస్టు-అక్టోబరుల మధ్య ఆర్‌బీఐ అర శాతం మేర కీలక రేట్లను పెంచే అవకాశం ఉందని కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది.