వారు ఎందుకొచ్చారంటే..: కేటీఆర్‌

వారు ఎందుకొచ్చారంటే..: కేటీఆర్‌

హైదరాబాద్‌లో లా అండ్‌ ఆర్డర్‌ బాగుందనే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను ఇక్కిడికి పంపించాయని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతూ ఇక్కడే ప్రజాస్వామ్యం ఉందని కాంగ్రెస్ నమ్మిందని అన్నారు. విపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు బీజేపీ బి-టీంలోనో సి-టీంలోనే ఉండాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనకు సీఎం కావాలాన్న కోరిక, అత్యాశ లేదన్న కేటీఆర్‌.. 15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఉండి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యవహారాలు చూస్తారని అన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రంలో ఏకపక్షంగానే కొనసాగుతాయని, సొంతంగానే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో ఉండను అని చెప్పారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమవుతుందని, రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువని అన్నారు.