లాక్ డౌన్ సరే...కామన్ ఎంట్రన్స్ టెస్టుల మాటేమిటి ?

లాక్ డౌన్ సరే...కామన్ ఎంట్రన్స్ టెస్టుల మాటేమిటి ?

హైదరాబాద్‌ లో మరో సారి లాక్‌ డౌన్‌ విధిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్టుల భవితవ్యం ఏంటనేది ఆసక్తిగా మారింది. జులై 1 నుంచి పలు కామన్ ఎంట్రన్స్‌ టెస్టులు ప్రారంభం కానున్నాయి. జులై 15వ తేదీ వరకూ పలు పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. జులై 6 నుంచి 9 వరకూ ఎంసెట్‌ జరగనుంది. దీనికి 2 లక్షల 22వేల మంది అప్లై చేసుకున్నారు. మిగిలిన ఎంట్రన్స్‌ లతో కలిపి మొత్తం 4,68,000 వేల మంది పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న పలు కాలేజీలను ఎంట్రన్స్‌ టెస్టులకు సెంటర్లుగా కూడా ఖరారు చేశారు. ఈ సమయంలో లాక్‌డౌన్ విధిస్తే పరీక్షలు వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రేపు అంటే జులై 1 న జరగాల్సిన పాలిటెక్నిక్ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుందని అందులో ఎలాంటి మార్పు లేదని సాంకేతిక విద్యా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.