తేలని నీటి వాటాలు 

తేలని నీటి వాటాలు 

తెలుగు రాష్ట్రాల నీటి వాటాలను కృష్ణా రివర్ బోర్డు ఎటూ తేల్చలేదు.  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం, టెలిమెట్రీ, బోర్డు నిర్వహణ  అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ హెచ్ కే సాహూ నేతృత్వంలో జరుగుతోన్న సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్ సీ నాగేందర్, ఏపీ తరపున జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్ సీ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు పాల్గొన్నారు. బోర్డు మీటింగ్ లో టెలిమెట్రీ అంశం కూడా కొలిక్కిరాలేదు. టెలి మెట్రీ పైనా 15 రోజుల్లో ప్రత్యేక సమావేసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  నీటి పంపిణీ విషయంలో  అన్యాయం జరుగుతోందని తెలంగాణ చెబుతోంది. ఈ నేపథ్యంలో నీటి వాటాల నిష్పత్తిని మార్చాలని తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి కోరారు. అయితే... ఆయన అభ్యర్తనపై ఏపీ సీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 
రెండు రాష్ట్రాల అభిప్రాయలను లిఖిత పూర్వకంగా పంపాలని కృష్ణ రివర్ బోర్డ్

 కోరింది. గోదావరి నది తరహాలోనే కృష్ణ నది బోర్డ్ మ్యానువల్ రూపొందించి ఇరు రాష్ట్రాలకు పంపుతామని బోర్డు చెప్పింది. 

ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ప్రస్తుతం ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాటా పద్ధతిన వాడుకుంటున్నాయి. ఈ నీటిని నిర్ణయించిన దామాషా పద్ధతినే ఇరు రాష్ట్రాలకు బోర్డు పంపిణీ చేసింది.  గతేడాది నీటి వినియోగాన్ని సమీక్షించిన తర్వాత 2018-19 సంవత్సరానికి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.   మొదటి దశ టెలిమెట్రీని సమీక్షించడంతో పాటు రెండో దశలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల ఖరారుపై కూడా చర్చించారు.  నీటి వినియోగం, తాగునీరు-ఇతర అవసరాల కోసం వినియోగించే నీరు  20శాతం మాత్రమే పరిగణన, గోదావరి నుంచి మళ్లిస్తోన్న నీటికి సంబంధించిన వాటా, సాగర్ ఎడమ కాల్వ కింద వినియోగం, బోర్డు పరిధి తదితర అంశాలపై కూడా  సమావేశంలో చర్చించారు.