అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. న్యూజెర్సీలోని సీమెన్స్ హెల్త్ కేర్‌లో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్న ఆశిష్ అనే యువకుడు.. ఈ నెల 21న కాలిఫోర్నియాలోని యోస్మైట్‌ నేషనల్ పార్క్‌లో పర్వతారోహణ చేస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందకు జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సన్నిహితులు.. పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.. అతని భౌతికకాయాన్ని స్వదేశానికి పంపించేందుకు అమెరికాలోని తెలుగుసంఘాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం. ఆశిష్ మరణవార్తతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.