ఇకపై రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతి...

ఇకపై రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతి...

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగోలు పదోన్నతి పొందాలంటే ఇకపై కనీస సర్వీసు రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు మూడేళ్ల కనీస సర్వీసు ఉంటేనే  పదోన్నతి ఇచ్చేవారు. అయితే పాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రెండేళ్లకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ళ కాలపరిమితిని రెండేళ్లకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ఉద్యోగ నేతలతో చర్చల సందర్భంగా.. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తాజా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. దీంతో తెలంగాణాలో ఎనమిది వేలకు పైగా ఉద్యోగులు పదోన్నతులు పొందనున్నారు.