అమెరికాలో.. కామారెడ్డి వాసి మృతి

అమెరికాలో.. కామారెడ్డి వాసి మృతి

అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి బోటు ప్రమాదంలో మృతి చెందారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40) అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. స్నేహితులతో కలిసి నదిలో బోటింగ్‌ చేయడానికి వెళ్లిన ఆయన నీట మునిగి ప్రమాదవశాత్తు మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. నదిలో నుండి మృతిదేహాన్ని వెలికి తీశామని... కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని డల్లాస్ పోలీసులు తెలిపారు. వెంకట్రామిరెడ్డి మృతితో ఆరెపల్లిలో విషాదం నెలకొంది. వెంకట్రామిరెడ్డి మృతదేహం రెండుమూడు రోజుల్లో ఆయన స్వగ్రామమైన ఆరెపల్లికి రానున్నట్లు తెలుస్తోంది.