అధికారంలోకి వస్తాం... ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం...

అధికారంలోకి వస్తాం... ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ఎలా మోసం చేశారో ప్రజల్లోకి వెళ్తున్నామన్న ఉత్తమ్... కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మహిళ సంఘాలు, డ్వాక్రా సంఘాలను విస్మరించారని మండిపడ్డ ఆయన... ప్రతి మహిళ సంఘాలకు రూ. లక్ష గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. బ్యాంకుల ద్వారా రూ. 10 లక్షల రుణాలను ఇప్పించి... వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందన్న పీసీసీ చీఫ్... టీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ లో కొనుగోలుచేయడం, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉత్తమ్... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క రైతును కూడా పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... ఎన్నికలు ఉన్నాయి అని రైతు పెట్టుబడి పథకం పెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా, రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు చేసి మంచి ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ఉత్తమ్... చేనేత కార్మికులకు సరైన సహాయం చేస్తామని... రూ. 200 కోట్లతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసిన టి.పీసీసీ చీఫ్... ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.