కాంగ్రెస్‌కు దింపుడు కళ్లెం ఆశ ఉంది...

కాంగ్రెస్‌కు దింపుడు కళ్లెం ఆశ ఉంది...

కాంగ్రెస్ పార్టీపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్‌లో చేరిన నల్గొండ టీడీపీ నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్... ఈ సందర్భంగా మాట్లాడుతూ... నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇంకా దింపుడు కల్లం ఆశ ఉందని... కాంగ్రెస్‌కి అడుగో... బొడుగో ఆశ ఉందని సెటైర్లు వేశారు. కానీ, నల్గొండ జిల్లా ప్రజలు ఒక మాట ఆలోచించాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్... 'కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీయగలడా?' అంటూ ప్రశ్నించారు. 

దశాబ్దాలుగా ఆ పార్టీకి అవకాశం ఇచ్చి... అధికారంలో కూర్చోబెట్టినా నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చారని మండిపడ్డారు కేటీఆర్. దశాబ్దాలుగా అవకాశం ఇచ్చినా నల్గొండ జిల్లాను అభివృద్ధిలో వెనక్కి నెట్టిన ఆ జిల్లా నేతలు... రాష్ట్రం మొత్తం అధికారం ఇస్తే ఏదో పొడిచేస్తామంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మహారాష్ట్ర రైతులు గుర్తిస్తున్నారు... ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారు... దేశంలో వివిధ సూచికల్లో శరవేగంగా రాష్ట్రం దూసుకుపోతుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు వచ్చి... తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తుంటే... ఇక్కడి నేతలకు మాత్రం కనబడడం లేదంటూ మండిపడ్డారు.