రైతు బంధు, రైతు బీమా చరిత్రలో నిలిచిపోతాయ్..

రైతు బంధు, రైతు బీమా చరిత్రలో నిలిచిపోతాయ్..

రైతు బంధు, రైతు బీమా పథకాలు తెలంగాణ చరిత్రలో నిలిచి పోయే పథకాలని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈరోజు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం సర్దాపూర్ లోని రైతుబీమా యోజన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లక్షలాది రైతు కుటుంబాలకు రైతు బీమా పెద్ద భరోసా అని వెల్లడించారు. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి సశ్యశ్యామలం చేస్తామని ఆయన వివరించారు. రైతు బంధుపథకంతో 57 వందల కోట్ల రూపాయల లబ్ధిని రైతులకు చేకూర్చామని ఆయన అన్నారు. 

'సిరిసిల్ల అంటే ఒకప్పుడు కన్నీళ్ళు తప్పితే, నీళ్ళు తెలియని ప్రాంతం, సిరిసిల్ల అంటే నేతన్న, రైతన్నల ఆత్మహత్యలే గుర్తొచ్చేవి. అలాంటిది ఇక నుండి అలా ఉండదు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల మందిని నియమించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ బీమా అనేది మండల, గ్రామ యునిట్ లుగా కాకుండా, రైతు యునిట్ గా చేయాలని ఆయన తెలియజేశారు. కేటీఆర్, పోచారం లు పాల్గొన్న ఈ సభలో బాబాజీ కులస్థులు తమను యస్.సి. జాబితాలో చేర్చాలంటూ నినాదాలు చేశారు.