ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయి!

ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయి!

ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయంటూ సెటైర్లు వేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్... కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది... అయితే పోలింగ్ సమయం ముగియగానే అన్ని జాతీయ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి... ఆయ సంస్థలతో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఒక్కోఛానెల్ ఫలితాలు ఒక్కో రకంగా ఉన్నాయి... కొన్ని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ప్రకటిస్తే... మరికొన్ని ఛానెళ్లు భారతీయ జనతా పార్టీయే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక సోషల్ మీడియాలో ప్రతీ విషయంపై స్పందించే మంత్రి కేటీఆర్... ఈ ఎగ్జిట్ పోల్స్‌పై కూడా ఓ ట్వీట్ వేశారు... కన్ఫ్యూజ్‌ అవుతున్నాను... రెండు ఇంగ్లిష్ ఛానెళ్లు బీజేపీకే అత్యధిక స్థానాలంటున్నాయి... మరో రెండేమో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లంటున్నాయి... ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయంటూ ట్వీట్‌ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసిన కేటీఆర్ సెటైర్లు వేస్తూనే నవ్వులు పూయించారు.