'విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ'

'విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ'

విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు గ్రామంలో(ఉస్మాన్ నగర్) 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజమణి మురళి యాదవ్, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వని కరెంట్ ను.. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందని తె లిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి 24 గంటలు కరెంటు ఇవ్వడం ఒక విచిత్రం అన్న జానారెడ్డి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తాడు అని హరీష్ రావు ప్రశ్నించాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో రోజుకు నాలుగు గంటలు కరెంటు తీసేయడం జరిగింది. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలుస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.