తెలంగాణ పారిశ్రామిక వృద్ధిలో పెరుగుదల

తెలంగాణ పారిశ్రామిక వృద్ధిలో పెరుగుదల

గతేడాదితో పోలిస్తే రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి పెరిగిందన్నారు తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వార్షిక నివేదికను ఆయన ఇవాళ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2017-18లో రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి 10.4 శాతం వృద్ధిని సాధించిందన్నారు.. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడుల ద్వారా 5 లక్షల 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 55 శాతం అధికంగా ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలువరు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ కంపెనీలకు కేటీఆర్ పారిశ్రామిక అవార్డులు అందజేశారు.