సింధుకు నగదు బహుమతి నిరాకరణ

సింధుకు నగదు బహుమతి నిరాకరణ

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతిని నిరాకరించింది. తాజాగా గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారి జాబితా తాయారు చేసి.. నగదు బహుమతులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ జాబితాలో కామన్వెల్త్ లో పతకం సాధించిన పీవీ సింధు పేరు లేదు. ఏపీలో సింధు డిప్యూటీ కలెక్టర్ పోస్టును తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంతో ఏపీ అధికారిణి అయిన సింధుకు నగదు బహుమతిని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. ఈ జాబితాలోని సైనా నెహ్వాల్ కు రూ. 50 లక్షలు, షట్లర్ సిక్కీరెడ్డికి రూ. 30 లక్షలు, రుత్వికా శివానీకి రూ. 20 లక్షలు.. బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ కు రూ. 25 లక్షల నగదు బహుమతులను ప్రకటించింది. 2016 ఒలింపిక్స్ లో పతకం సాధించిన సింధుకు రూ. 5 కోట్ల నగదుతో పాటు ఇంటి స్థలాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.