ఇక నుంచి ఇంటి వద్దకే వస్తాయి... 

ఇక నుంచి ఇంటి వద్దకే వస్తాయి... 

దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నది.  లాక్ డౌన్ అంటే ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలి. అలా ఇళ్లకు మాత్రమే పరిమితమైతే కరోనాను ఎదుర్కొనవచ్చు.  కట్టడి చెయ్యొచ్చు.  అలా కాకుండా కరోనాను కట్టడి చేయడానికి అంతకు మించి మరొక మార్గం లేదు. అందుకే కరోనా విషయంలో ప్రభుత్వాలు అంతటి సీరియస్ గా ఉంటున్నాయి.  

ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా పాటించాలి.  లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  కానీ, ఉదయం సమయంలో నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున బయటకువస్తున్నారు.  గుంపులు గుంపులుగా ఒకేసారి ఒక  చోటకు చేరితే ఉపయోగం ఉండదు.  అందుకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.  ఇకపై నిత్యవసర వస్తువులైనా కూరగాయలు వాగైనా డైరెక్ట్ గా ఇళ్లవద్దకే తీసుకురావాలని చూస్తున్నది.  అంతేకాదు, కూరగాయలను విడిగా కాకుండా కేజీ, అరకేజీ చొప్పున ప్యాక్ చేయించి ఇళ్ల వద్దకు పంపితే ప్రజలను బయటకు రాకుండా కొంత వరకు అడ్డుకునే అవకాశం ఉంటుంది. ప్రతి  రెండు రోజులకు ఒకమారు ఇలా కూరగాయలను ఇళ్ల వద్దకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.  నిత్యవసర వస్తువులు వేటికి తెలంగాణలో కొరత లేదు కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.