డబ్బే ప్రధానం కాదు...

డబ్బే ప్రధానం కాదు...

సమాజంలో ఆరోగ్యం కంటే డబ్బే ప్రధానం అనే భావన పోవాలి అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్... ఫిక్కీ ఆధ్వర్యంలో 'నకిలీలు, స్మగ్లింగ్ పై పోరాటం - ఆర్థికాభివృద్ధి అత్యవసర వేగవంతం చేయడం'పై సదస్సును ప్రారంభించిన ఆయన... సమాజంలో కొన్ని ఆహార వస్తువులను తినాలా? వద్దా? అనే భయం ఏర్పడుతోందన్నారు. డబ్బు అన్ని విషయాలలో ప్రధానం కాదు, పనికిరాదన్న ఆర్థిక మంత్రి... ప్రజలకు మంచి ఆహారం అందించేలా చేయడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. గ్లోబల్ విలేజ్‌లో ఓ దగ్గర నూతన వస్తువు ఉత్పత్తి అయితే దానిని కొద్ది కాలంలోనే అందిపుచ్చుకునే రోజులు ఇవి అన్నారు. 

ఎంత సంపద పెరిగితే అది ప్రజల అవసరాలు, ఆరోగ్యం, విద్య కనీస సౌకర్యాలు తీర్చాలన్నారు మంత్రి ఈటల రాజేందర్... సంపద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం అందించాలని.. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ పై చర్చలే జరుగుతున్నాయి... కానీ, నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ వార్మింగ్ నిరోధించడానికి హరితహారం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక కుటుంబాలను ఆగం చేసే క్లబ్‌లను నిషేధించామని... ప్రజల జీవితాన్ని ఛిద్రం చేయడం కాదు... వారి జీవితాలను బాగు చేసేదే ప్రభుత్వం అదే తెలంగాణ ప్రభుత్వం అన్నారు. సంస్కరణలకు తెలంగాణ గొప్ప కేంద్రం కాబోతోందని వెల్లడించిన మంత్రి ఈటల... గత మూడేండ్లలో నకిలీలపై దాడులు చేస్తున్నాం... ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని... నకిలీలపై ఎలాంటి సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో నగరంలో ఒక్కో బజార్ లో నకిలీ వస్తువులు చెలామణి చేస్తున్నారిన ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి... వినియోగదారులను చైతన్య పర్చాల్సిన అవసరం ఉంది... ఇందుకోసం స్వచ్చంధ సంస్థలు కూడా పనిచేయాలని సూచించారు.