హాస్టళ్ళ మూసివేత పై తెలంగాణా డీజీపీ సీరియస్

హాస్టళ్ళ మూసివేత పై తెలంగాణా డీజీపీ సీరియస్

హాస్టళ్ళ మూసివేత తెలంగాణా డిజిపి మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. బలవంతంగా హైదరాబాద్ లో హాస్టళ్ళను మూసివేసి బయటికి పంపించి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిజానికి ఈ విషయం మీద అనేక మంది మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. అయితే ఈ విషయం మీద మీడియాలో కూడా వరుస కధనాలు ప్రసారం అయ్యాయి. లాక్ డౌన్ ముఖ్య ఉద్దేశమే జనాలు కలవకూడదు అని కానీ ఇప్పుడు హాస్టల్స్ మూసివేయడంతో వారంతా పోలీసు స్టేషన్ ల ముందు బారులు తీశారని మీడియాలో కధనాలు ప్రసారం అయ్యాయి. దీంతో హాస్టళ్ళ వ్యవహారంపై వెంటనే పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.  ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్లేందుకు కోరితే అవసరమైన పాసులు జారీ చేయాలని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి హాస్టల్ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని  అధికారులకు డిజిపి ఆదేశించారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి ఎటువంటి ఎన్వోసిలు జారీ చేయరని ఆయన పేర్కొన్నారు.