లాక్‌డౌన్‌పై ప్రధాని, సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు.. కఠినంగా అమలు..

లాక్‌డౌన్‌పై ప్రధాని, సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు.. కఠినంగా అమలు..

లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి.. మధ్యాహ్నం నుంచి మరింత కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వియ నిర్బంధంలో ఉండాలన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుందన్న డీజీపీ.. జీవో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశామన్నారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికిల్స్‌కు మాత్రమే అనుమతి ఉంది.. ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి. వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి. సమస్యను అరికట్టాలి అంటే ప్రజలెవరూ రోడ్ల పైకి రావొద్దు.. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి.. తెలంగాణ సమాజం కోసం పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని ప్రకటించారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన ఆయన. .డే టైంలో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు మూసివేయనున్నట్టు తెలిపారు. ఒక కాలనీలో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి.. ప్రతీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు డీజీపీ. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు.. ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారని వార్నింగ్ ఇచ్చారు.

ఇక, సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి.. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి ఉంటుందన్న ఆయన.. మీడియాకు ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఉంటుందన్నారు. చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తాం.. వైలేషన్ కి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన డీజీపీ.. ప్రతి బైక్ పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.. యాక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని, సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.