తెలంగాణ డిప్యూటీ స్పీకర్ కు కరోనా...

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ కు కరోనా...

కరోనా సడలింపులు ఇచ్చినప్పటి నుండి తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు రోజుకు 1000 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎంఎల్ఏ లకు కూడా ఈ వైరస్  సోకుతుంది. అయితే తాజాగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు అలాగే  ఆయన కొడుకుకి పాజిటివ్ వచ్చింది, అయితే మిగితా కుటుంబసభ్యులకు నెగెటివ్ రావడంతో వారందరిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.  అయితే ఈ రోజే తెలంగాణ హోం మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత మొహమ్మద్ అలీకి కూడా కరోనా సోకింది. దీంతో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 15,394 కరోనా కేసులు నమోదుకాగా 253  మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.