తెలంగాణాలో వెయ్యికి దగ్గరగా కరోనా కేసులు

తెలంగాణాలో వెయ్యికి దగ్గరగా కరోనా కేసులు

తెలంగాణలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.  నిన్నటి రోజున తెలంగాణలో వెయ్యికి దగ్గరగా  కేసులు నమోదయ్యాయి. ఈరోజు కూడా దాదాపుగా అన్ని కేసులే నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది.  ఇందులో 9,559 యాక్టివ్ కేసులు ఉండగా 5,582 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో ఆరుగురు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 253కి చేరింది.  కొత్తగా నమోదైన 975 కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 861 కేసులు నమోదు కావడం విశేషం. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, రంగారెడ్డిలో 40, మేడ్చల్ లో 20, నల్గొండ 2, సంగారెడ్డి 14, భద్రాద్రి కొత్తగూడెం 8, కరీంనగర్ 10, సిద్ధిపేట 1, వరంగల్ అర్బన్ 4, మహబూబ్ నగర్ 3, ఆసిఫాబాద్ 1, గద్వాల్ 1,  సూర్యాపేట 1, గద్వాల్ 2, మహబూబాబాద్ 1, కామా రెడ్డి 2, యాదాద్రి 2, వరంగల్ రూరల్ 1 కేసులు నమోదయ్యాయి.