దక్షిణాదికి కర్నాటక గెలుపు ముఖద్వారం...

దక్షిణాదికి కర్నాటక గెలుపు ముఖద్వారం...

దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముఖద్వారం కానుంది అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె.లక్ష్మణ్... కర్నాటకలో బీజేపీ సింగిల్‌గా మెజార్టీ సీట్లు సాధించదానికి మా కేంద్రప్రభుత్వ పథకాలే కారణమన్నారాయన. దేశమంతా నరేంద్ర మోదీ హవా నడుస్తోందన్న లక్ష్మణ్... అందులో భాగంగానే కర్నాటక ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని వెల్లడించారు. 

కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని స్పష్టం చేశారు లక్ష్మణ్... కర్నాటక ప్రజలు 10 ఏళ్ల యూపీఏ, ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు బుద్ధిచెప్పారని పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అవినీతి పాలనకు ప్రజలు తగిన బుద్దిచెప్పారని అభిప్రాయపడ్డన బీజేపీ తెలంగాణ చీఫ్... కాంగ్రెస్ ఇక మునిగిపోయే నావా... తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఇదే తరహా తీర్పు ఇస్తారని జోస్యం చెప్పారు. కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావంతో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందన్నారు లక్ష్మణ్.