పొత్తుల్లేకుండానే పోటీ..

పొత్తుల్లేకుండానే పోటీ..

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అన్ని స్థానాల్లో తమ పార్టీనే పోటీ చేస్తుందన్నారు టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఢిల్లీలో  ఈరోజు అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఒక రోజు అమిత్ షా తెలంగాణా పర్యటనకు రానున్నారని తెలిపారు.

అమిత్ షా రాష్ట్ర పర్యటన కు రాకముందు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రతి లోక్‌సభ, అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై సమగ్ర నివేదిక రూపొందిస్తామని వివరించారు. ఓటర్ల సరళీకృత, జిల్లాల వారిగా ఉన్న పార్టీ పరిస్థితిని అధ్యక్షుడు అమిత్ షాకి వివరించనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలలో‌ పార్టీ పరిస్థితులపై 'ప్లాన్ ఆప్ ఆక్షన్' తయారు చెస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో చేపట్టబోయే బస్సుయాత్రలో.. కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని, రాష్ట్రంలో బీజేపీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని లక్ష్మణ్ వివరించారు.