పది నెలలుగా జీతాల్లేవు.. ఆదుకోండి

పది నెలలుగా జీతాల్లేవు.. ఆదుకోండి

తమకు జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో పలువురు అర్చకులు అబిడ్స్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. పది నెలలుగా జీతాలు లేక కుటుంబపోషణ కష్టంగా మారిందని వారు ఆరోపించారు. ప్రభుత్వం నుంచి కొంత.. గుడి ఆదాయంలో కొంత మొత్తంలో జీతాలుగా చెల్లిస్తామని పది నెలలు అవుతున్నప్పటికీ.. ఒక్క పైసా కూడా రాలేదంటూ అర్చక స్వాములు వాపోయారు.. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
file Photo