ముగిసిన సీఎస్‌ల భేటీ

ముగిసిన సీఎస్‌ల భేటీ

హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ దినేష్‌కుమార్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, సచివాలయాన్ని అప్పగించాలని ఈ భేటీలో ఏపీ సీఎస్‌ను కోరారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ... దీనిపై తమ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా ఏపీ అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇరు రాష్ట్రాల అధికారులు. 

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన కమిటీ రెగ్యులర్‌గా సమావేశమయ్యేలా చూడాలని నిర్ణయించారు... ఇరు రాష్ట్రాల తరపున రామకృష్ణారావు, ప్రేమ్ చంద్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల బదిలీలకు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఇరు రాష్ట్రాల సీఎస్‌లు... హైకోర్టు అనుమతితో తాత్కాలిక డీఎస్పీల నియామకం చేపట్టాలని నిర్ణయించారు.