తెలంగాణాలో 2, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు 

తెలంగాణాలో 2, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు 

ఇవాళ తెలంగాణలో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు కేసులలో ఒక కేసు ప్రైమరీ కాంట్రాక్ట్ కేసు కాగా మరో కేసు మూడేళ్ళ బాలుడు కావడం గమనార్హం. ఆ బాబు సౌదీ అరేబియా నుండి వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 39 మందికి కరోనా వైరస్‌ సోకగా ఇప్పుడు ఆ సంఖ్య 41కి చేరింది. మరోవైపు... కరోనాపై అధికారులతో మంత్రి ఈటల సమీక్షించారు. తెలంగాణలో తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే, కరోనా నివారణ చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయో? లేదో? తెలసుకున్నారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన మంత్రి ఈటల... తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు.

కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించారు ఈటల. మరో పక్క ఏపీ లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో తాజా గా ఒక్కో కేసు నమోదయినట్టు చెబుతున్నారు. దీంతో మొత్తం 10కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి.  వాషింగ్టన్ నుంచి ఈ నెల 22 న విజయవాడ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న 22 ఏళ్ల యువకుడికి తాజా పరీక్షలలో కరోనాగా నిర్దారణ అయింది. మరో కేసులో న్యూ ఢిల్లీ నుంచి 18 వ తేదీ దురంతో ఎక్స్ప్రెస్ లో విజయవాడ వచ్చి అక్కడనుంచి గుంటూరు లోని నివాసానికి క్యాబ్ లో వెళ్లిన 52 ఏళ్ల వ్యక్తికి తాజాగా కరోనా వ్యాధి నిర్దారణ అయింది. కరోనా లక్షణాలతో 23వ తేదీ తన కుమారుడి బైక్ పై గుంటూరు నుంచి విజయవాడ చెస్ట్ హాస్పిటల్ కి రావడంతో కుమారుడిని కూడా ఐసోలేషన్ కి పంపారు వైద్యులు. దీంతో క్యాబ్ డ్రైవర్ కోసం కూడా వెతుకుతున్నారు పోలీసులు.