జూన్ 8నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు...!

జూన్ 8నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు...!

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. జూన్ 8నుంచి జులై 5 వరకూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. మొదట మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. 3పరీక్షలు పూర్తయిన తర్వాత కరోనా ప్రభావం, హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేసింది. మిగిలిన 8 పరీక్షల షెడ్యూల్ ని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక కరోనా కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడుతున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అన్నారు. అంతేకాకుండా క్లాసుకు 20 మంది విద్యార్థులను మాత్రమే ఉంటారు. ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోనూ హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు.