తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధం..ఇవాళ కోర్టుకు రిపోర్ట్‌ ఇవ్వనున్న ప్రభుత్వం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధం..ఇవాళ కోర్టుకు రిపోర్ట్‌ ఇవ్వనున్న ప్రభుత్వం

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ పదోతరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ సర్కార్‌ సిద్దమైంది..టెన్త్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించిన క్లారీటీ ఇవాళ క్లారిటీ రాబోతోంది. ..గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 8నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది...ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేయబోతోంది... అయితే న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌. కరోనా లాక్‌డౌన్‌తో పాటు కోర్టు ఆదేశాల కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.. అయితే ఇటీవల సడలింపులు ఇవ్వడంతో ఎగ్జామ్స్‌ నిర్వహించేందుందు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది ప్రభుత్వం. అలాగే వైరస్‌ కారణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. దీంతో జూన్‌ 8 నుంచి నిర్వహించుకోవచ్చని హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షల నిర్వహణకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. జూన్ మూడు న కరోనాపై రివ్యూ చేసి మర్నాడు కోర్టుకు రావాలని సూచిండంతో ఇవాళ ఈ అంశంపై నిర్ణయం రానుంది.