కరోనాను అందరికీ అంటిస్తా .. యువతి హల్చల్

కరోనాను అందరికీ అంటిస్తా .. యువతి హల్చల్

కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైంది. ఆ దేశంలో వైరస్‌ బారిన పడి మరణించినవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా నివారణకు వర్జీనియా, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా సహా అమెరికావ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో జన సంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. ఇక మన దేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం.ఇదిలా ఉంటే తాజాగా ఓ యువతి తనకు కరోనా సోకిందని అది అందరికి అంటిస్తానని హల్ చల్ చేసింది. డల్లాస్‌కు చెందిన లొర్నైన్‌ మరదియాగ అనే యువతి ఇటీవల స్నాప్‌చాట్‌లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అందులో తనకు కరోనా పాజిటివ్‌ సోకిందని వివరించిన మరదియాగ.. ఈ వైరస్‌ను అందరికీ అంటిస్తానంటూ పేర్కొంది. 'నేను వాల్‌మార్ట్‌కు వెళుతున్నా.. అక్కడ అందరికీ నేను వైరస్‌ను అంటిస్తాను. ఎందుకంటే నేను పోతే.. మీరు కూడా పోతారు' అని కామెంట్లు చేసింది. ఈ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కి పడ్డారు పోలీసులు అప్రమత్తమై ఆయువతి అడ్రెస్ ను కనుక్కొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు పాజిటివ్‌ వచ్చినట్లు మా దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు. ఆమెను 21 రోజులు కస్టడీలో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు.