కండల వీరులకే చెమటలు పట్టించిన కండల రాణి

కండల వీరులకే చెమటలు పట్టించిన కండల రాణి

కండల వీరుల గురించే మాట్లాడుకుంటాం... గంటల తరబడి జిమ్‌లలో కష్టపడి, ఎన్నో ప్రత్యేకమైన డైట్లను పాటిస్తూ... తమ శరీర ఆకృతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునీ మరీ కండలు పెంచుతుంటారు. కానీ, కండల వీరులకు చెమటలు పట్టిస్తోంది... ఓ కండల రాణి... ఏకంగా ప్రపంచంలోని 'స్ట్రాంగ్ మన్' టాప్ 30 జాబితాలో చోటు సంపాదించింది. కండలవీరులకు తానేమీ తక్కువకాదని నిరూపిస్తూ ఏకంగా వరల్డ్ స్ట్రాంగ్ మన్ జాబితాలో 28 ర్యాంక్‌ను కైవసం చేసుకుని ఔరా అనిపిస్తోంది భోపాల్‌కు చెందిన ప్రియాంక వైశ్యా... సాఫ్ట్‌వేర్ ఇంజినీరైన ప్రియాంక... బాబీ బిల్డర్‌గా మారడానికి చేసిన ప్రయాణం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. ఇక భారత్‌ నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైన మహిళ ప్రియాంక కావడం మరో విశేషం. 

మూడేళ్ల క్రితం డంబుల్స్ కోసం ఏకంగా తన ల్యాప్‌టాప్‌నే అమ్మేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించింది 25 ఏళ్ల ప్రియాంక... తాజా ర్యాంకింగ్ నాకు చాలా ప్రేరణ కలిగించిందని... ఇది ప్రపంచ టైటిల్ మీద ఫోకస్ పెట్టడానికి ప్రోత్సహించేవిధంగా ఉందన్నారు. నా దృష్టి అంతా వరల్డ్ టైటిల్ పైనే ఉందని... దాని కోసం మరింత కఠినమైన శిక్షణ, ధ్యానం చేస్తానని తెలిపారామె. నేను టాప్ 30లో ప్రవేశించి సంతృప్తిగా ఉండాలనుకోవడం లేదు... ఇది ఖచ్చితంగా నాకు చాలా స్ఫూర్తిని ఇస్తోంది... కానీ, నేను ప్రపంచ టైటిల్ గెలిచే వరకు కసరత్తులు ఆపనని స్పష్టం చేసింది ప్రియాంక.