నిరుద్యోగులకు గుడ్ న్యూస్..గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  తెలంగాణ రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఈ పోస్ట్ లకు జూన్ 10నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ లు స్వీకరిస్తామని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసారు. నోటిఫికేషన్ పై మరిన్ని వివరాల కోసం ఔత్సాహితులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.