ప్రతి అంశంలోనూ వైసీపీ రాజకీయ కోణం చూస్తుంది

ప్రతి అంశంలోనూ వైసీపీ రాజకీయ కోణం చూస్తుంది

ప్రతి అంశంలోనూ వైసీపీ రాజకీయ కోణం చూస్తుంది అని అన్నారు టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పడవ ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రభుత్వ కుట్ర అనే వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్ ప్రమాదం ప్రభుత్వ హత్య ఐతే.. వైస్సార్ మరణం కూడా ప్రభుత్వ హత్యేనా అని విమర్శించారు. ప్రతి వారం కోర్టుకు వెళ్లేందుకు పాదయాత్రను ఆపే జగన్.. గోదావరిలో పడవ మునిగి గిరిజనులు చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేరా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అరాచరక శక్తులతో గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై జగన్‌ దాడి చేయించారని.. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి అంశంలోనూ వైసీపీ రాజకీయ కోణం చూస్తుందన్నారు.

మరోవైపు టీడీపీ పార్టీపై రమణదీక్షితులు మాట్లాడడం చాలా అనుమానాలను కలిగిస్తోందన్నారు. రమణదీక్షితులు వెనుక బీజేపీ, వైసీపీ హస్తం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. రమణదీక్షితులుకి ఏమైనా అజెండా ఉంటే ఏదో ఒక పార్టీలో చేరి మాట్లాడాలని సూచించారు. ప్రధాన అర్చకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అర్చకుల పదవీ విరమణ ప్రతిపాదన పాతదే అని తెలిపాడు. ఏ ఒక్క అర్చకుని కోసమో టీటీడీ నిబంధనలు మార్చదన్నారు.