బహిరంగ చర్చకు సిద్ధం... ఇడుపులపాయకు వస్తా

బహిరంగ చర్చకు సిద్ధం... ఇడుపులపాయకు వస్తా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎంపీ మురళీ మోహన్... రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... నా జీవితం తెరిచిన పుస్తకం... జగన్ ఆరోపణలపై ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అంటూ సవాల్ విసిరారు... తాను బహిరంగ చర్చకు సిద్ధం... ఇడుపులపాయకు రావడానికైనా రెఢీ అంటూ ఛాలెంజ్ విసిరారు మురళీమోహన్. తాను 50 ఏళ్లుగా వ్యాపారాల్లో ఉన్నా... కానీ, ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేదన్న టీడీపీ ఎంపీ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నాపై ఆరోపణలు చేసినప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసి నిలబడ్డానన్నారు. 

ఇసుక దందా చేస్తున్నానని ఆరోపిస్తున్న జగన్ స్థాయి ఏంటి...? అని మండిపడ్డ మురళీమోహన్... జగన్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు... జగన్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఇడుపులపాయ రావడానికైనా తాను రెడీ అన్నారు మురళీ మోహన్. నీతి కోసం బతుకుతున్న మాపై బురదజల్లితే ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించిన ఆయన... రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలను జనం పట్టించుకోవడంలేదన్నారు.