ఆసక్తిగా మారిన టీడీపీ ఎమ్మెల్యే తీరు..!

ఆసక్తిగా మారిన టీడీపీ ఎమ్మెల్యే తీరు..!

సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, టీడీపీ నుంచి గెలిచిన కొంతమంది క్రమంగా వైసీపీ వైపు అడుగులు వేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా.. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడం, సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక, పార్టీకి రాజీనామా చేశాం.. శాసనసభ సభ్యత్వాన్నికి కాదు అనేవారు కూడా ఉన్నారు. తాజాగా.. ప్రకాశం జిల్లాలోని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాజకీయ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇవాళ మార్టూరులో తన అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. భవిష్యత్‌ వ్యూహంపై చర్చించేందుకే ఏలూరి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏలూరి కొద్దిరోజులుగా వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై ఇవాళ ఆయన తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.