మా పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు...

మా పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు...

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు ఆ పార్టీ సీనియమర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి... వరంగల్ అర్బన్ మినీ మహానాడులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... అధికార టీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాల ప్రకారమే టీడీపీని నడిపిస్తున్నామని స్పష్టం చేసిన రేవూరి... ప్రజలలో ఉన్న తెలంగాణ వాదాన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ గెలిచాడు... అధికారంలోకి వచ్చాక  ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి కొంత మంది నాయకులు పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డ రేవూరి... నాకు రాజకీయ జన్మ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ... నేను పార్టీని వీడేదిలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రలో తెలుగుదేశం పార్టీని నిలబెడతామన్న ప్రకాష్ రెడ్డి... టీఆర్ఎస్ ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం లేదు, దళితులకు భూములు ఇవ్వలేదు, రైతులను పట్టించుకోలేదని... గిట్టుబాటు ధర కల్పించాలేక... కేసీఆర్ కేంద్రం పై నెట్టేశారని ఆయన విమర్శించారు.