2019 ఎన్నికల్లో టీడీపీ పతనం ఖాయం

2019 ఎన్నికల్లో టీడీపీ పతనం ఖాయం

ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు... సైకోసిస్ వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నారంటూ వ్యాఖ్యానించిన బీజేఎల్పీ నేత... ఆ వ్యాధి వల్లే మొన్న తిరుపతి సభలో చంద్రబాబు... బ్రిటీష్ వారితో పోరాడామని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పతనం ఖాయమని జోస్యం చెప్పిన విష్ణుకుమార్ రాజు... రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం నిధులు వెనక్కి తీసుకుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంపడిన ఆయన... కేంద్రం నిధులు వెనక్కి తీసుకోలేదని చంద్రబాబే యూ టర్న్ తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీలు వస్తాయని ప్రకటించారు విష్ణుకుమార్ రాజు.