స్నేక్ సవాల్ కు తమన్నా రిప్లయ్ ఇది..!

స్నేక్ సవాల్ కు తమన్నా రిప్లయ్ ఇది..!
తమన్నా అందంతో పాటు డ్యాన్స్ చేయడంలోను దిట్టే.  అద్భుతంగా డ్యాన్స్ చేయగలదు కాబట్టే ఆమెకు ప్రత్యేక గీతాల్లో నృత్యం చేసే అవకాశాలు వస్తున్నాయి.  ఇందుకు ఓ ఉదాహరణ జై లవకుశ.  ఈ సినిమాలో స్వింగ్ జరా అనే పాటకు తమన్నా వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  అయితే తమన్నాకు ఓ సవాల్ ఎదురైంది.  పారిస్ కు చెందిన స్నేక్ డీజే మెజెంటా రిడ్డిమ్ పాటకు డ్యాన్స్ చేయాలని సవాల్ విసిరాడు.  
 
స్నేక్ విసిరిన సవాల్ ను ఛాలెంజ్ గా తీసుకున్న తమన్నా.. ఆ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి సవాల్ లో నెగ్గింది.  తమన్నా డ్యాన్స్ కు స్నేక్ మాత్రమే కాకుండా.. అటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.  తమన్నా చేసిన మెజెంటా రిడ్డిమ్ డ్యాన్స్ వీడియోకు లక్షకు పైగా లైక్ లు వచ్చాయి.  ఇప్పుడు సోషల్ మీడియాలో తమన్నా డ్యాన్స్ ట్రేండింగ్ అవుతున్నది.