టీ పీసీసీ రేసులో రేవంత్ వెనుకబడటానికి కారణం ఇదేనా...!

టీ పీసీసీ రేసులో రేవంత్ వెనుకబడటానికి కారణం ఇదేనా...!

 

మల్కజ్ గిరి ఎంపీ,టీ కాగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేసులో వెనకబడటానికి బలమైన కారణాలున్నాయని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చాలా కాలం క్రీయశీలకంగా వ్యవహరించిన రేవంత్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ,కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటి చేశాయి. ఇందులో రేవంత్ కు కీలక పాత్ర ఉంది. ఆ తర్వాత టీడీపీ కాంగ్రెస్ కి రిలేషన్ కట్ అయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలోనూ ఎవరికి వారుగా ఎన్నికల బరిలో దిగారు. ఈ రెండు పార్టీల మద్య రిలేషన్ సరిగా లేకపోయినా రేవంత్ మాత్రం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సంబంధం కొనసాగిస్తున్నారని ఇది పార్టీకి నష్టం చేస్తుందని కొందరు కాంగ్రెస్ సీనియర్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
 
రేవంత్ కు పదవి ఇస్తే చంద్రబాబు పార్టీని నడుపుతారని, అది పార్టీకి మరింత నష్టం అని కొందరు ఆరోపించారట.రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ కన్నా తనను ఎక్కువ ప్రమోట్ చేసుకుంటాడని అది పార్టీకి మరింత నష్టమన్న ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయట. ఈ కారణాలన్ని కూడా రేవంత్ రెడ్డి కి టీ పీసీసీ అధ్యక్ష పదవి దూరం చేశాయని సొంతపార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి...