చరణ్ ఊర్లో చిరు 

చరణ్ ఊర్లో చిరు 

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. తాజాగానే రెండో షెడ్యూల్ షూటింగ్ ను మొదలెట్టుకున్న ఈ చిత్రం కొన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ ను షూట్ చేయనుంది.ఆ సీన్స్ ను రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కోసం వేసిన సెట్స్ ను ఉపయోగించనున్నారు. హైదరాబాద్ లో బూత్ బంగ్లాపరిసరాల్లో ఈ సెట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. 

ఆ సెట్ ను కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉపయోగించనున్నారు. సైరా సినిమా బ్రిటిష్ కాలంలో జరిగిన పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనుండడంతో ఇలా విలేజ్ సెట్ లో షూట్ జరపాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో చిరంజీవి స్వాత్యంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. నయనతార భార్య పాత్రలో కనిపించనుండగా, అమితాబ్ బచ్చన్..గురు పాత్రలో నటించారు. ఈ పీరియాడిక్ వార్ డ్రామాలో తమన్నా, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లు నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్లతో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.