స్వాదాద్రి రియ‌ల్ ఎస్టేట్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోకి

స్వాదాద్రి రియ‌ల్ ఎస్టేట్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోకి

స్వాదాద్రి రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రఘు,  శ్రీనివాస్, మీనాక్షిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజ‌ల ద‌గ్గర నుండి డ‌బ్బులు వ‌సులు చేసి ఆ డ‌బ్బుల‌తో భూముల‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు హైదరాబాద్ పోలీసులు. స్వాదాద్రి రియల్ ఎస్టేట్  సంస్థ బాధితులకు దాదాపుగా 300 కోట్ల రూపాయ‌లు కుచ్చుటోపి పెట్టినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 3 వేల మందికి పైగా బాధితులున్నట్టు తెలుస్తోంది.

ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి భూములు కొన్న స్వాదాద్రి కంపెనీ.. ఆ భూములను అమ్మేసి ప్రజలను మోసం చేసింది. ఏజెంట్‌లు, బ్రోకర్ల ద్వారా డబ్బులు వసూలు చేసిన స్వాదాద్రి యజమాని యార్లగ‌డ్డ ర‌ఘు.. మల్టీలెవల్ మార్కెటింగ్‌ ద్వారా రియల్ ఎస్టేట్‌ను కొనసాగించారు. ఈ స్కామ్‌లో ఏజెంట్ల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.