కరోనా ఇలా కూడా చేస్తుంది.. బాలీవుడ్ జంటను కలిపింది..

కరోనా ఇలా కూడా చేస్తుంది.. బాలీవుడ్ జంటను కలిపింది..

కరోనా ఇప్పుడు దీని గురించే అంతా చర్చ, ఎవ్వరు ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తుంది. ఎవరైనా పొరపాటున రోడ్ ఎక్కరా వీపులు పగిలేలా చేస్తుంది. అంతే కాదు దూరమైన జంటలను కూడా కలపగలను అంటోంది కరోనా.. అవును గతంలో విడిపోయిన వాళ్లిద్దరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే విడిపోయినా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో తమ పిల్లల కోసం వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడా విషయాన్ని హృతిక్ రోషన్ స్వయంగా ప్రకటించారు.

తమ పిల్లలు హ్రేహాన్, హృదాన్‌కు అండగా నిలిచేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని  సోషల్ మీడియా లో చెప్పుకొచ్చాడు హృతిక్ .. ఈ 21 రోజులు తమందరం కలిసే ఉంటామని కొద్ది రోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది.. పిల్లల పట్ల తన ప్రేమకు ఇది నిదర్శనం తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకొన్న ఈ నిర్ణయానికి థ్యాంక్స్ సుసానే అంటూ కామెంట్ రాసుకొచ్చాడు. అయితే హృతిక్ రోషన్ తన భార్య సుసానే నుంచి 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే..