పారిస్‌లో ఉగ్రదాడి...

పారిస్‌లో ఉగ్రదాడి...

ఉగ్ర దాడితో పారిస్‌ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీక్ ఎండ్ కావడంతో ఓపెరా హౌజ్ లోని బార్లు, రెస్టారెంట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ సమయంలో శనివారం రాత్రి ఓ ఉగ్రవాది అల్లాహూ అక్బర్‌ అంటూ నినాదాలు చేస్తూ కత్తితో విచక్షణ రహితంగా అక్కడి జనాలపై దాడికి పాల్పడ్డాడు. మరోవైపు పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా.. రద్దీ ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కాల్పులు జరపటంతో.. ఉగ్రవాది మరణించాడు. ఈ దాడిలో ఓ వ్యక్తి చనిపోగా.. పలువురికి గాయాలు అయ్యాయి. వారందరిని దగ్గరలోని ఆస్ప్రతిలో చికిత్స నిమ్మితం చేర్పించారు. ఈ దాడి చేసింది తామే అంటూ ఐసిస్‌ ప్రకటించుకుంది.