సుశాంత్ టైం టేబుల్ బోర్డ్..ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాడో..!

సుశాంత్ టైం టేబుల్ బోర్డ్..ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాడో..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సినీ పరిశ్రమలో కలకలం రేపింది. సుశాంత్ ఆత్మహత్య పై ఆయన అభిమానులకు, కుటుంబ సబ్యులకు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ పరిశ్రమలో ఎదురైన అనుభవాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట పలువురు ఆరోపించారు. కాగా తాజాగా ఆయన ఆత్మహత్యకు కారణం అతడి గర్ల్ ఫ్రెండ్ రియా నే అని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా సుశాంత్ సోదరి తాజాగా అతడి టైం టేబుల్ బోర్డు ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సుశాంత్ జూన్ 29 నుంచి తాను చేయాలనుకున్న పనుల వివరాలను పేర్కొన్నాడు. అందులో "ఉదయాన్నే నిద్రలేవాలి..బుక్స్ చదవాలి, గిటార్ నేర్చుకోవాలి..గుడ్ కంటెంట్ ఉన్న సినిమాలు, స్టోరీలు చూడాలి..జూన్ 29 నుంచి రోజూ వర్కౌట్లు చేయాలి, ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ ఫాలో అవ్వాలి..చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి." అంటూ టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బోర్డ్ ను సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి "సుశాంత్ త‌న కెరీర్ గురించి చాలా ప్లానింగ్స్ చేసుకున్నాడు.. అతడికి న్యాయం జ‌ర‌గాలి" అని పేర్కొన్నారు.