చివరిక్షణాల్లో సుశాంత్ గూగుల్ సెర్చ్ హిస్టరీ ఇదే..!

చివరిక్షణాల్లో సుశాంత్ గూగుల్ సెర్చ్ హిస్టరీ ఇదే..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత బాలీవుడ్ పరిశ్రమలో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. బైకాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో సైతం దుమారం రేగింది. అతడి ఆత్మహత్యకు ఇండస్ట్రీ లోని నెపోటిజమే కారణమంటూ నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాకుండా అతడి ఆత్మహత్య వెనక రోజుకో కొత్త కోణం భయట పడుతుంది. తాజాగా ఫోరెన్సిక్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ జూన్​ 14న ఆత్మ‌హ‌త్య‌కు కొద్ది నిమిషాల ముందు ఉదయం 10:15 గంటల ప్రాంతంలో  తన పేరునే గూగుల్ లో సెర్చ్ చేసినట్టు తేలింది. పలుమార్లు సుశాంత్ తన గురించి గూగుల్ చేసి, తన టీం సభ్యులతో మాట్లాడినట్టు తేలింది. అదే సమయంలో అతడు ఫ్రూట్ జ్యూస్ తగినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతడు మానసికంగా కృంగిపోయినట్టు, తన ప్రతిష్ఠతను మ‌స‌క‌బార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నట్లు అతడు బావించాడని వివరించారు. కాగా సుశాంత్ కేసులో ఇప్పటికే పోలీసులు 30 మందిని విచారించారు.